ఆ ఓటమి వీరి వైఫల్యమేనా ? జగన్ సీరియస్ అందుకేనా ?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ( YSRCP ) అభ్యర్థి ఓటమి చెందడాన్ని ఆ పార్టీ అధినేత,ఏపీ సీఎం జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.

ఏడుకు ఏడు స్థానాలను వైసీపీ అభ్యర్థులే గెలుచుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నా, 22 మంది ఎమ్మెల్యే లకు ఒక మంత్రిని ఇంచార్జీగా నియమించినా,ఒక్క స్థానాన్ని వైసీపీ కోల్పోయింది.

వైసీపీ కి చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యే లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తారని ముందుగానే ఊహించినా, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే లు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడాన్ని జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డితో పాటు, టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే సమాచారంతో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి( Undavalli Sridevi ), నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డిలను సస్పెండ్ చేశారు.

అయితే ఈ వ్యవహారం లో నిఘా అధికారుల వైఫల్యాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు.ముందుగానే వైసీపీ ఎమ్మెల్యే లతో భేరసారాలను చేస్తున్నా.దీనిని పసిగట్టి ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన ఇంటిలిజెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రాధమికంగా జగన్ నిర్ధారణ కు వచ్చారు.

వైసీపీ ప్రభుత్వం లో మొదటి నుంచి నిఘా వైఫల్యం కనిపిస్తూనే ఉంది.ఇంటిలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంధ్రా ను తీసుకురావాలని జగన్( YS jagan ) భావించినా, కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో వెనక్కి తగ్గారు.

Advertisement

చివరకు సీతారామాంజనేయులు ను కొనాగిస్తున్నారు.

ఆయన కూడా మంచి సమర్ధవంతుడైన అధికారిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.అయితే చంద్రబాబు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను ఉండవల్లి లోనే ఉండి , వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే లతో భేరసారాలను తనకు అత్యంత నమ్మకస్తులైన పారిశ్రామిక వేత్తలతో పూర్తి చేయించారట.అందుకే నిఘా అధికారులు కూడా పసిగట్టలేకపోయారట.

అయితే ఈ వ్యవహారంలో తప్పు ఎలా జరిగినా ఇంటిలిజెన్స్ అధికారులపై వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు