క్రిష్ ( Krish )దర్శకత్వం లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు ( Harihara Veeramallu )చిత్రం షూటింగ్ కార్యక్రమాలు సగానికి పైగా పూర్తయ్యాయి.ఇప్పటికే విడుదల అయిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టీజర్ తో అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమా ఎప్పుడో పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలకు వరుసగా ఓకే చెప్పడం.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆ సినిమాల యొక్క షూటింగ్ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుంది.
అందుకే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ను పక్కకు పెట్టేశాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎప్పుడూ పిరియాడిక్ నేపథ్యం ఉన్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటించిన లేదు.
ఈసారి హరిహర వీరమల్లు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ని అలా చూడాలని అభిమానులు కోరుకున్నారు.కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వడం లేదు.
దర్శకుడు క్రిష్ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు.హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.భీమ్లా నాయక్ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.అయినా కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ను పూర్తి చేయలేక పోయాడు.
దాంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.హరిహర వీరమల్లు సినిమా విషయం లో పవన్ కళ్యాణ్ ఆసక్తిని కనబడచక పోవడానికి కారణం ఏంటి అనేది తెలియాలి అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వినోదయ సీతమ్ సినిమా రీమేక్ తో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.