దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
ఈ మేరకు ఏప్రిల్ 5వ తేదీన సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.