మిచౌంగ్ తుఫాన్ భీభత్సం

సూర్యాపేట జిల్లా:గత రెండు రోజులుగా కురుస్తున్న మిచౌంగ్ తుఫాన్( Cyclone Michaung ) తో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం( Ananthagiri mandal )లో పంటలు తీవ్రంగా నష్టపోయి రైతన్నలు విలవిలలాడుతున్నారు.

చేతికొచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో నోటి కాడికి రాకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు మీసాల ఏసోబు మాట్లడుతూ ఎకరం పొలంలో వేసిన బంతి తోట పూర్తిగా నీట మునిగి మొక్కలు నేలకు వాడడంతో భారీ నష్టం వాటిల్లిందని వాపోయారు.సుమారు లక్ష రూపాయల పెట్టుబడితో బంతి తోట వేశానని అనుకోకుండా వచ్చిన తుఫానుతో ఆర్థికంగా నష్టపోయినట్టు చెప్పారు.

గోండ్రియాల గ్రామంలో వరి పంట నేలకొరిగి నష్టపోయినట్టు మరోరైతు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి కౌలు రైతులకు రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు.

ఐక్యరాజ్యసమితిలో హిందీకి అరుదైన గుర్తింపు?
Advertisement

Latest Suryapet News