Tollywood Heroes : ఒక్క హిట్ కోసం దండయాత్ర చేస్తున్న మీడియం రేంజ్ టాలీవుడ్ హీరోలు.. ఆ లక్కు దక్కేనా ?

పదవిలో లేని రాజకీయ నాయకున్ని, పరాజయాలు ఉన్న హీరోని ఎవ్వరూ పట్టించుకోరు.అందుకే అర్జెంటుగా రాజకీయ నాయకుడికి పదవి కావాలి హీరోల కైతే విజయం కావాలి.

 Medium Range Heros Waiting For One Hit-TeluguStop.com

మరి మన హీరోలు చాలా రోజులుగా టాలీవుడ్( Tollywood ) పై దండయాత్ర చేస్తున్న కూడా ఒక్క విజయం కూడా వారిని పలకరించడం లేదు.చాలా ఏళ్లుగా వీరంతా సినిమాలు తీసి తీసి అలిసిపోతున్నారు.

కానీ వరుస పరాజయాలే వీరికి దక్కుతున్నాయి.మరి ఒక్కటంటే ఒక్క హిట్టు కోసం దశాబ్దాలుగా దండయాత్ర చేస్తున్న ఆ హీరోలు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Akhil Akkineni, Naga Chaitanya, Nithin, Sharwanand, Small Heroes, Tollywo

లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్( Gopichand ) కి విజయం లేదు.కంటి నిండా నిద్ర కూడా పోయారో లేదో పాపం.దశాబ్ద కాలం గడిచిపోయిన ఒక్క విజయం దక్కక పోతుందా అని ఆశగా సినిమాలు తీస్తూనే ఉన్నారు.ఇప్పుడు ఆయన మొత్తం బీమా పైనే తన ఆశలు పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా అయినా విజయాన్ని ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Telugu Akhil Akkineni, Naga Chaitanya, Nithin, Sharwanand, Small Heroes, Tollywo

అంత ఎందుకు నాగచైతన్య కూడా లవ్ స్టోరీ సినిమా( Love Story ) తర్వాత ప్రాపర్ ఒక హిట్టు లేదు.ఆ సినిమా తర్వాత తీసిన కస్టడీ, థాంక్యూ చిత్రాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నయ్యం.ఇప్పుడు చందు మొండేటి తీస్తున్న తండెల్ పైనే అతడి ఆశలన్నీ ఉన్నాయి.

Telugu Akhil Akkineni, Naga Chaitanya, Nithin, Sharwanand, Small Heroes, Tollywo

ఇక శర్వానంద్( Sharwanand ) ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ఆయన మర్చిపోయి ఉంటాడు.ఒకే ఒక జీవితం సినిమా పర్వాలేదనిపించినా అదేమీ పెద్ద విజయవంతమైన సినిమా కాదు.దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శర్వానంద్ తో తాజాగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.చూడాలి ఈ చిత్రంతోనైనా శర్వానంద్ జాతకం మారిపోతుందో లేదో.వీరు మాత్రమే కాదు అఖిల్, రవితేజ, నితిన్, రామ్ పోతినేని వంటి హీరోలు కూడా విజయం సాధించి చాలా ఏళ్ల అయిపోతుంది.మరి వారు కూడా ఆ తమ తదుపరి చిత్రాలతో తెరపైకి రాబోతున్నారు.

ఈసారైనా ఈ మీడియం రేంజ్ హీరోలు అంతా కూడా హిట్టు కొట్టాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube