Tollywood Heroes : ఒక్క హిట్ కోసం దండయాత్ర చేస్తున్న మీడియం రేంజ్ టాలీవుడ్ హీరోలు.. ఆ లక్కు దక్కేనా ?

పదవిలో లేని రాజకీయ నాయకున్ని, పరాజయాలు ఉన్న హీరోని ఎవ్వరూ పట్టించుకోరు.అందుకే అర్జెంటుగా రాజకీయ నాయకుడికి పదవి కావాలి హీరోల కైతే విజయం కావాలి.

మరి మన హీరోలు చాలా రోజులుగా టాలీవుడ్( Tollywood ) పై దండయాత్ర చేస్తున్న కూడా ఒక్క విజయం కూడా వారిని పలకరించడం లేదు.

చాలా ఏళ్లుగా వీరంతా సినిమాలు తీసి తీసి అలిసిపోతున్నారు.కానీ వరుస పరాజయాలే వీరికి దక్కుతున్నాయి.

మరి ఒక్కటంటే ఒక్క హిట్టు కోసం దశాబ్దాలుగా దండయాత్ర చేస్తున్న ఆ హీరోలు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/"/ లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్( Gopichand ) కి విజయం లేదు.

కంటి నిండా నిద్ర కూడా పోయారో లేదో పాపం.దశాబ్ద కాలం గడిచిపోయిన ఒక్క విజయం దక్కక పోతుందా అని ఆశగా సినిమాలు తీస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఆయన మొత్తం బీమా పైనే తన ఆశలు పెట్టుకున్నారు.మరి ఈ సినిమా అయినా విజయాన్ని ఇస్తుందో లేదో వేచి చూడాలి.

"""/"/ అంత ఎందుకు నాగచైతన్య కూడా లవ్ స్టోరీ సినిమా( Love Story ) తర్వాత ప్రాపర్ ఒక హిట్టు లేదు.

ఆ సినిమా తర్వాత తీసిన కస్టడీ, థాంక్యూ చిత్రాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నయ్యం.

ఇప్పుడు చందు మొండేటి తీస్తున్న తండెల్ పైనే అతడి ఆశలన్నీ ఉన్నాయి. """/"/ ఇక శర్వానంద్( Sharwanand ) ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ఆయన మర్చిపోయి ఉంటాడు.

ఒకే ఒక జీవితం సినిమా పర్వాలేదనిపించినా అదేమీ పెద్ద విజయవంతమైన సినిమా కాదు.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శర్వానంద్ తో తాజాగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.చూడాలి ఈ చిత్రంతోనైనా శర్వానంద్ జాతకం మారిపోతుందో లేదో.

వీరు మాత్రమే కాదు అఖిల్, రవితేజ, నితిన్, రామ్ పోతినేని వంటి హీరోలు కూడా విజయం సాధించి చాలా ఏళ్ల అయిపోతుంది.

మరి వారు కూడా ఆ తమ తదుపరి చిత్రాలతో తెరపైకి రాబోతున్నారు.ఈసారైనా ఈ మీడియం రేంజ్ హీరోలు అంతా కూడా హిట్టు కొట్టాలని కోరుకుందాం.