మందుబాబు వీరంగం-మహిళపై దాడికి యత్నం

సూర్యాపేట జిల్లా:నేనెవరో తెలుసా అంటూ అర్ధరాత్రి ఓ మందుబాబు వీరంగం.మద్యం మత్తులో టిఫిన్ సెంటర్ మహిళపై దాడికి యత్నం.

పోలీసులకు సమాచారం ఇచ్చిన సదరు మహిళ.పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించిన మందుబాబు.

ముగ్గురు యువకులు మద్యం సేవించి అర్ధరాత్రి వరకు పట్టణంలో హల్చల్.తమ్మిశెట్టి హరిశంకర్,బత్తుల మధు,వల్లెపు వెంకిగా గుర్తించిన పోలీసులు.

తమ్మిశెట్టి హరిశంకర్ కోదాడ సర్కిల్ లోని ఓ ఎస్ఐకి ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో అర్ధరాత్రి ముగ్గురు యువకులు మద్యం సేవించి పట్టణంలో వీధుల వెంట బైక్ పై చక్కర్లు కొడుతూ హంగామా సృష్టించారు.

Advertisement

అనంతరం ఖమ్మం క్రాస్ రోడ్ లోని ఓ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేశారు.డబ్బులు అడిగిన పాపానికి హోటల్ నడుపుతున్న మహిళలపై నేనెవరో తెలుసా?డబ్బులు ఇవ్వనంటూ దురుసుగా ప్రవర్తించి దాడికి దిగాడు అందులో హరి శంకర్ అనే యువకుడు.అడ్డుగా వచ్చిన భర్తపై కూడా చేయి చేసుకోబోయాడు.

అంతటితో ఆగకుండా నేను ఫలానా ఎస్సైకి డ్రైవర్ గా పని చేస్తున్నానంటూ తన ఊరు పేరు చెప్పి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు.అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సదరు మహిళ సమాచారం ఇవ్వగా అతడిని మందలించే ప్రయత్నం చేశారు.

ఏమాత్రం జంకకుండా మేము మందు తాగడానికే బయటికి వచ్చామంటూ, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.ఎంత చెప్పినా వినిపించుకోకుండా పోలీసులపై బూతులతో ఎదురుదాడికి దిగి,అర్ధరాత్రి సుమారు గంటసేపు పోలీసులను సతాయించాడు.

ఎట్టకేలకు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించిన పోలీసులు వారు ముగ్గురూ మద్యం సేవించినట్లు గుర్తించి,వారి వివరాలను నమోదు చేసుకున్నారు.ఈ సమయంలో జరుగుతున్న తతంగాన్ని వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్ ను కూడా పోలీసుల ముందే దుర్భాషలాడుతూ బెదిరించడం గమనార్హం.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

ఓ ఎస్ఐకి ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేసే హరిశంకర్ ఈ విధంగా ఎస్ఐ పేరు చెప్పుకుని తాగి తందనాలు ఆడుతూ సదరు ఎస్ఐకి మచ్చతెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులే మాట్లాడుకోవడం విశేషం.పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ.

Advertisement

మద్యం సేవించి వచ్చి తన దగ్గర టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా తనపై దాడికి యత్నించిన మందుబాబుపై కోదాడ టౌన్ స్టేషన్లో సదరు టిఫిన్ సెంటర్ మహిళ ఫిర్యాదు చేసింది.అనంతరం బాధితురాలు షైక్ మీరాబీ మాట్లాడుతూ తనకు హరిశంకర్ వలన ప్రాణహాని ఉందని,ఏ సమయంలోనైనా వచ్చి తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని వాపోయింది.

పోలీసులు అతనిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని,తనకు, తన భర్తకు న్యాయం చేయాలని వేడుకుంది.

Latest Suryapet News