మేడారం జాతరకు పోతూ మార్గ మధ్యలో గుండెపోటుతో మృతి

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన భిక్షం (49) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వర మాధారం శివారు బ్రిడ్జి వద్ద గుండెపోటుతో మృతి చెందాడు.

ఎనిమిది మంది స్నేహితులు కలిసి నాలుగు ద్విచక్ర వాహనాలపై ఆదివారం హుజూర్ నగర్ నుండి మేడారం జాతరకు బయలుదేరారు.

మార్గ మధ్యలో ఖమ్మం జిల్లా ఈశ్వరమాధారం శివారు బ్రిడ్జి వద్దకు రాగానే భిక్షం గుండెపోటు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితులు చెబుతున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News