వల్లాపురంలో వ్యక్తి దారుణ హత్య

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండలం వల్లాపురంలో గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన వీరబాబును వ్యవసాయ పొలం వద్ద కళ్ళలో కారంకొట్టి కర్రలతో దాడి చేసి హతమార్చిన ఘటన ఆదివారం కలకలం రేపింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత కొద్దికాలంగా భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి.ఆదివారం పొలం పనులకు వెళ్లిన తమ్ముడు వీరబాబును అన్న భద్రయ్య కొట్టి చంపినట్లు ఆరోపిస్తున్నారు.

Man Brutally Murdered In Vallapuram-వల్లాపురంలో వ్య�

పొలంలో విగత జీవిగా పడిన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest Suryapet News