ఏప్రిల్ 29న పేటలో మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ

సూర్యాపేట జిల్లా:ఈ నెల 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటి సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ భూమి,భుక్తి,విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక సాయుధ రైతాంగ పోరాటంలో తన 13వ ఏటనే తుపాకీ చేతపట్టి పేద ప్రజల వైపు నిలబడ్డ యోధురాలు మల్లు స్వరాజ్యం అని,బాంచన్ దొరా నీ కాల్మొక్తా అని వెట్టిచాకిరి చేస్తున్న పేదలకు బందూకులు చేత పట్టించి దొరలపై తిరుగుబాటు చేసిన ఘనత ఆమెదని దక్కుతుందన్నారు.ఏప్రిల్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు అధిక సంఖ్యలో ప్రజలు, అభ్యుదయ వాదులు,మేధావులు,కవులు,కళాకారులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.ఈ సభకు ముఖ్యాతిథిగా సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం ఏచూరి,మరియు ఇతర వామపక్షాల నేతలు హాజరవుతున్నారని తెలిపారు.

అనంతరం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి మాట్లాడుతూ యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రంపై,రాష్ట్రం కేంద్రంపై ఆరోపణలు చేసుకుంటూ రైతులను తప్పుదోవ పట్టించాయని అన్నారు.అలాగే ముందస్తు సమాచారం లేకుండా ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయటం సరైన విధానం కాదన్నారు.

వ్యవసాయ మార్కెట్లో రైతులు తెచ్చిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా కమీషన్ ఏజెంట్లు మిల్లర్స్ కుమ్మక్కయి ధాన్యం కింటాల్ ధర ఐదు వందల యాభై రూపాయలు తగ్గిస్తున్నారని అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు.

ఇప్పటికైనా ఉన్న ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మెదరమెట్ల వెంకటేశ్వర్లు,కొప్పుల రజిత,కందాల శంకర్ రెడ్డి,రెడ్డి మోహన్ రెడ్డి,పల్లా సుదర్శన్,ఉప్పలయ్య,దండా శ్రీనివాస్ రెడ్డి,ఎస్కే సైదా,పందిరి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది...ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి...

Latest Suryapet News