తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేయండి...

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Rajanna Sircilla ) మండలంలో జూన్ 2 న ఆదివారం జరిగే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ( Congress party )కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉత్సవాలను విజయవంతం చేసి అమరులైన విద్యార్థులకు అంకితం చేయాలన్నారు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన కవులు,కళాకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు వారిని పిలిచి గౌరవించడం జరుగుతుందన్నారు.

అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుండి తెలంగాణ కోసం పోరాటం చేసిన దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మ సర్వాయి పాపన్న వీరి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చిన్నిబాబు, గంట బుచ్చ గౌడ్, పందిర్ల సుధాకర్ గౌడ్, సూడిద రాజేందర్, బండారి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

Latest Rajanna Sircilla News