గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలని మహాధర్నా...!

సూర్యాపేట జిల్లా: వ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమలకు ప్రభుత్వం అందజేస్తున్న రెండో విడత గొర్రెల పంపిణీ( Distribution of sheep ) బదులుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి యాదవ్( Ravi Yadav ) డిమాండ్ చేశారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొదటి విడత పంపిణీ చేసిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో విజయవంతమైందని చెబుతున్నా గొర్రెల పంపిణీలో అనేక అవకతవకలు,అవినీతి జరిగిందన్నారు.గొర్రెల పంపిణీలో కొంతమంది బ్రోకర్లు జొరబడి సాదుకోవడానికి ఉపయోగపడని గొర్రె పిల్లలను,ముసలి గొర్రెలను పంపిణీ చేశారన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గొర్రెలను మన రాష్ట్రంలో పంపిణీ చేయడంతో అక్కడి వాతావరణం పెరిగిన గొర్రెలు ఇక్కడ వాతావరణం ఇమడలేక గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు.రెండో విడతలో డీడీలు కట్టిన వారందరికీ నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

మున్సిపాలిటీ పరిధిలోని గొల్ల కురుమలు కూడా గొర్రెల పంపిణీ ప్రారంభించి,వారిని ఆర్థికంగా అభివృద్ధి కావడానికి తోడ్పడాలని కోరారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో శ్రీదేవికి సమర్పించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కడం లింగయ్య,జిల్లా సహాయ కార్యదర్శి వజ్జ వినయ్ యాదవ్,జిల్లా నాయకులు కొమురెల్లి,ఉప్పుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్మాతగా మారడంతో డబ్బంతా పాయె.. డిప్రెషన్‌లో ప్రముఖ టాలీవుడ్ హీరో..?
Advertisement

Latest Suryapet News