చంద్రబాబు అరెస్టుపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అక్రమం అంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది.

ఈ మేరకు మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో పిటిషన్ వేశారు.

చంద్రబాబుకు రిమాండ్ విధించడం చెల్లదని దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే పిటిషన్ ను ఏపీ హైకోర్టు అనుమతించగా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో నటించిన స్టార్ హీరో ఈయన ఒక్కడేనా..?
Advertisement

తాజా వార్తలు