రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారదర్శకంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో లక్కీ డ్రా నిర్వహించారు.2023-25 ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా ఉదయం 11 గంటలకు ప్రారంభించారు.

లాటరీ పద్ధతిన అర్హులను ఎంపిక ప్రక్రియ చేపట్టి ఎంపికైనవారి పేర్లను వెంటనే ప్రకటించారు.

గౌడ కమ్యూనిటీ కి 15 శాతం అనగా (9), ఎస్సీలకు 10 శాతం అనగా (5) మద్యం దుకాణాలకు రిజర్వ్ కాగా , 70% అనగా (34) మద్యం దుకాణాలకు జనరల్ క్రింద కేటాయించడం జరిగింది.ఎంపికైనవారు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్‌ రుసుంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది.

లైసెన్సుదారులు డిసెంబర్‌ 1 నుంచి కొత్త దుకాణాల్లో అమ్మకాలకు అనుమతిస్తారు.జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ,జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి, గులాం ముస్తాఫా, సీఐ ,సిరిసిల్ల ,ఎంపీఆర్ (మరాఠీ పోష్ రాజ) చంద్రశేఖర్,సీఐ ,ఎల్లారెడ్డిపేట ,గుండేటి రాము, సీఐ , వేములవాడ లు పాల్గొన్నారు.

హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు
Advertisement

Latest Rajanna Sircilla News