ప్రభుత్వ రంగ గిడ్డంగులను కాపాడుకుందాం:సీఐటీయూ నేత జె.వెంకటేష్

సూర్యాపేట జిల్లా:2014 లో కేంద్రంలో బీజేపీ( BJP ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలలను ఒక్కదాని తర్వాత ఒక్కటి ప్రైవేట్ పరం చేసిందని,అందులో భాగంగానే సెంటర్ వేర్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పుతుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.

వెంకటేష్( J Venkatesh ) అన్నారు.

గురువారం శాంతినగర్ ఇండస్ట్రీ ఏరియాలోని ఎఫ్సీఐ గిడ్డంగులలోని హమాలి కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో రైల్వే, విమానయానం,బొగ్గు గనులు,ఆయిల్ గ్యాస్ తదితర ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని ఆరోపించారు.ఇప్పటికే విద్య,వైద్యం అమ్మకం పెట్టీ కార్పొరేట్ లాభాలకు తాకట్టు పెట్టి వదిలి వేశారన్నారు.

రోజూ వారీగా లక్షలాది మంది హమాలీలు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో ఎగుమతి,దిగుమతి చేస్తూ ప్రభుత్వానికి,వ్యాపార సంస్థలకు లాభాలు తెస్తున్నా కానీ, హమాలీలకు చట్టబద్దమైన సంక్షేమ బోర్డు( Welfare Board ) ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు.హామాలీలకు పెన్షన్ సౌకర్యం,ఆరోగ్య భద్రత, పిఎఫ్,ఇఎస్ఐ లాంటి సౌకర్యాలు లేక పోవడం వల్ల హమాలీలు నష్టపోతున్నరన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సూర్యాపేట( Suryapet ) గిడ్డంగులకు వచ్చే బియ్యాన్ని ప్రైవేట్ గిడ్డంగులకు పంపించడం వల్ల 40 ఏండ్ల నుండి హమాలీ వృత్తిని నమ్ముకొని బతుకుతున్న కార్మికులకు సవంత్సరంలో వంద రోజులు కూడా పని దొరకడం లేదన్నారు.ఫిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక గ్రామీణ బంద్ లో హమాలీ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గోని కేంద్ర ప్రభుత్వ కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపుచ్చారు.

Advertisement

అనంతరం సిడబ్ల్యుసి మేనేజర్ వెంకన్నకు సమ్మె నోటీసు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ సూర్యాపేట జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు,జిల్లా అద్యక్షుడు ఎం.రాంబాబు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులూ సాయికుమార్, సిడబ్ల్యుసి హమాలీ సంఘం అద్యక్షుడు బాలరాజు,వెంకన్న యాదయ్య,లక్ష్మయ్య, నారాయణ,నరేష్, తదితరులు పాల్గొన్నారు.

చూపుడు వేలుకు చుక్క ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్య వేలుకు : కలెక్టర్
Advertisement

Latest Suryapet News