Pawan Kalyan : ప్రభుత్వ ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు..: పవన్ కల్యాణ్

ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే.

హెలికాప్టర్ దిగేందుకు అనుమతులు ఇవ్వకపోవడంతో వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో జనసేనాని( Janasenani ) పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అనుమతుల విషయంలో అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు.ఆర్ అండ్ బీ అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారని మండిపడ్డారు.

భీమవరంలో( Bhimavaram ) ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేసుకున్నామని పేర్కొన్నారు.కాకినాడలో హెలిప్యాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదన్నారు.అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటనలు వాయిదా వేసుకున్నామని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.తదుపరి సమావేశాలను మంగళగిరి కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు