Miss Perfect : అటు మెగా ఫ్యామిలీ ..ఇటు అక్కినేని ఫ్యామిలీ.. ఇద్దరికి పెద్ద దెబ్బే

లావణ్య త్రిపాఠి, అభిజీత్ దుద్దాల ప్రధాన పాత్రల్లో మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్( Miss Perfect ) ఇటీవల హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.అయితే దీనికి బాగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి.

 Lavanya Tripathi Big Bang To Akkineni And Mega Families-TeluguStop.com

దీనికి నిర్మాతగా సుప్రియ యార్లగడ్డ వ్యవహరించింది.సుప్రియ అక్కినేని సత్యవతి కూతురు అనే సంగతి తెలిసిందే.

ఆమె నిర్మాత అనగానే ఈ సిరీస్ ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు ఆశించారు కానీ తీరా ఇది ఒకే అపార్ట్‌మెంట్‌లో తీసిన బోరింగ్ సిరీస్ అని తెలుసుకొని డిసప్పాయింట్ అయ్యారు.ఈ సిరీస్ లో లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi )న ఓసిడి ఉన్న ఒక రొటీన్ క్యారెక్టర్ గా దర్శకుడు విశ్వక్ ఖండేరావు చూపించాడు.

ఆమె ఒక పనిమనిషి గా అభిజిత్ అపార్ట్మెంట్లో బట్టలు ఉతుకుతుంది.అదేమిటి అంటే ఆమెకు ఓసిడి ఉంటుంది కాబట్టి తన పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న అభిజిత్( Abhijit ) ఇంటిని చక్కదిద్దుతుంది.


Telugu Abhijith, Hot, Law, Perfect-Movie

హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్( Romantic Track ) మొదలు కావడం నుంచి చివరి దాకా అన్నీ ఇంతకుముందు చూసిన సినిమాల్లో లాగానే అనిపించాయి.ఇటీవల కాలంలో యూట్యూబ్ వెబ్ సిరీస్ లో దీనికంటే మంచిది కథలతో ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో వస్తున్నాయి.లావణ్య లాంటి ప్రముఖ హీరోయిన్ ను తీసుకొని ఇలాంటి చెత్త సిరీస్ చేయడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.ఈ వెబ్ సిరీస్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దారుణంగా ఉన్నాయి.

దీనిని ప్రసారం చేయాలని హాట్ స్టార్( Hotstar ) ఎందుకు అనుకుందో దానికే తెలియాలి.


Telugu Abhijith, Hot, Law, Perfect-Movie

సాధారణంగా వెబ్ సిరీస్ లో ఎలాంటి కొత్త కాన్సెప్ట్ నైనా చూపించే ఫ్రీడమ్ ఉంటుంది.దీనిని సినిమా థియేటర్లలో రిలీజ్ చేయరు కాబట్టి ఎక్స్‌పెరిమెంట్స్‌ హాయిగా చేసుకోవచ్చు.రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తీయవచ్చు.

కానీ తెలుగు దర్శకులు మాత్రం రొటీన్ సినిమా లాగానే వెబ్ సిరీస్‌లు తీసి ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు.ఇంకాస్త వర్క్ చేసి ఈ సిరీస్లో కామెడీ బాగా జోడించి క్లైమాక్స్ సన్నివేశాలను ఎలివేట్ చేసినట్లయితే బాగుండేదేమో.

కానీ ఉడికి ఉడకని ఆహారంలా ఈ సిరీస్ ను ప్రేక్షకుల మీదకి డైరెక్టర్ వదిలేశాడు.మెగా కోడలు మంచి వెబ్ సిరీస్ చేస్తుందేమో అని చూసిన మెగా అభిమానులకు కూడా నిరాశే ఎదురయింది.

భవిష్యత్తులో కూడా కథలో లావణ్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆమె కెరీర్ కి ముగింపు కార్డు పడటం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube