ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నిక( Lok Sabha Election _ల నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం( Integrated Control Room )ను ప్రారంభించామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( Collector S Venkatrao ) అన్నారు.

అదనపు కలెక్టర్ బిఎస్.లత,సిఈఓ అప్పారావుతో కలసి ఎలక్షన్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కలసి ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెల్ నందు సి.విజిల్,1950 కాల్ సెంటర్,సువిదా పర్మిషన్స్,ఎన్.జి.ఆర్.పి.ఎస్ పోర్టల్ అలాగే పి.డబ్ల్యు.డి సాక్షమ్ యాప్ అందుబాటులో ఉంటాయన్నారు.

జిల్లా ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో పలు సమస్యలు జరిగే సంఘటనలపై సత్వరమే పరిష్కార దిశగా సంబంధిత యాప్ ను అందుబాటులో ఉంచామని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కంట్రోల్ రూమ్ నందు సిబ్బందికి విడతల వారీగా విధులు కేటాయించామని తెలిపారు.

ఈకార్యక్రమంలో ఏఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు,ఈడిఎం గఫ్ఫార్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News