లగడపాటి సర్వే కి తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది.వివిధ రాష్ట్రాలలో ఎంతో మంది సీనియర్ నేతలు, పార్టీలు సైతం తమ గెలుపులపై సర్వేలు చేయించుకుంటూ ఉంటారు.100 కి 95 శాతం తప్పకుండా లగడపాటి సర్వే గురి తప్పదనే అంటారు పొలిటికల్ లీడర్స్.గతంలో ఎన్నో సర్వేలు చేసిన లగడపాటికి ఆ సర్వేలలో చాలా మటుకు నిజం అయ్యాయి కూడా అందుకే లగడపాటి సర్వే అంటే చాలు ఏపీలో నేతలు అందరూ వణికి పోతుంటారు.అంతేకాదు ఏపీలో ఇప్పటికి కూడా లగడపాటి తన సర్వే రిపోర్ట్ బయటపెట్టక పోవడానికి కారణం చంద్రబాబు చేసిన రిక్వెస్ట్ అనే టాక్ కూడా ఉంది…అయితే

ఏపీ జనాలకి లగటపాటి సర్వేలు అంటే ఎంతో నమ్మకం ఉంటుంది అంటూ ఏపీలో ఒక నేత కీలక వ్యాఖ్యలు చేశారు దాంతో ఇప్పుడు సర్వాత్ర లగడపాటి సర్వే పై ప్రజల్లో సస్పెన్స్ నెలకొంది.ఇంతకీ లగడపాటి సర్వే పై కామెంట్స్ చేసిన నేత ఎవరూ అంటే ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.ఏంటి షాక్ అయ్యారా.
నిజమే మాటలన్నది జగన్ రెడ్డి.ఆయన సర్వేలు అంటే ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తారట అంటూ జగన్ చెప్పడంతో ఒక్క సారిగా ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.
ఇప్పుడు అంతా ఈ విషయంపైనే చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే లగడపాటి ఈసారి ఏడాది ముందుగానే లగడపాటి సర్వే చేయించారట కానీ కొంతమంది ఒత్తిడుల కారణంగా విడుదల చేయలేదని ఆసర్వే ఫలితాలు ఇవే అని ఒక వార్త వైరల్ అవుతోంది…ఈ సర్వేలో వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని లగడపాటి తన సర్వేలో తేలినట్లు చెబతున్నారు.అంతేకాదు 2014 సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో భారీ మార్పులుంటాయని తన సర్వేలో తేలిందనే టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం తప్పదని వైసీపీ అఖండ మెజారిటీ తెచ్చుకోవడం ఖాయమని తెల్చారట….ఇంకా అందులో ఉన్న విషయాలేంటంటే… లగడపాటి సర్వే ప్రకారం జనసేన ఎఫెక్ట్ అంతా ఈ సారి చంద్రబాబు పై ఎక్కువగా ఉంటుందని లగడపాటి తెల్చారట.ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీని అగాధంలోకి తోసేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జగన్మోహనర్ రెడ్డి గతంలో కంటే కూడా రాను రాను ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని సర్వేలో తేల్చారు…అయితే జగన్ లగడపాటి సర్వేలు ప్రజలు నమ్ముతున్నారు అంటూ ప్రకటించడం లగడపాటి సర్వే తాలూకు రిజల్స్ ఇదేనని తేల్చడంతో టీడీపీ నేతల్లో టెన్షన్ వాతావరం నెలకొంది.