మహిళల ఆర్ధిక స్థిరత్వంపై అవగాహన కల్పించిన నాట్స్

ఎడిసన్ న్యూ జెర్సీ ఫిబ్రవరి 28: ఇల్లాలే ఇంటికి వెలుగు అనేది చాటి చెప్పేందుకు నాట్స్ నడుంబిగించింది.అతివలు ఆర్థిక స్థిరత్వం సాధించాలనేలక్ష్యంలో భాగంగా వారాంతాల్లో నాట్స్ వరుసగా మహిళల ఆర్థిక స్వావలంబనపై వెబినార్స్ నిర్వహించింది.

 Knots That Raise Awareness On Women's Financial Stability , Duna Exosia, Madhavi-TeluguStop.com

అతిన డునా ఎక్సోసియ(ఏడీఈ) విమెన్ ఎంపవర్‌మెంట్ సంస్థ నాయకురాలు, టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ ఐటీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రశాంతి గండి ఈ వెబినార్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్థిక అక్షరాస్యత, మహిళల ఆర్థిక స్థిరత్వం అనేఅంశాలపై అవగాహన కల్పించారు.అసలు మహిళలు పొదుపు ఎలా ప్రారంభించాలి.? చిన్న మొత్తాలతోనే పెద్ద పెద్ద ఆర్ధిక లక్ష్యాలను ఎలా సాధించాలి.? రిటైర్‌మెంట్ సమయానికి ఆర్ధికంగా ఏ ఢోకా లేకుండా ఎలా చేసుకోవాలి.? పొదుపుచేసిన సొమ్మును ఎలా పెట్టుబడులకు మళ్లించాలి.? ఆర్ధిక అంశాలపై స్వల్పకాలిక లక్ష్యాలు ఎలా ఉండాలి…? దీర్ఘకాలికలక్ష్యాలు ఎలా ఉండాలనే అంశాలపై దుర్గా ప్రశాంతి గండి చక్కగా వివరించారు.క్రెడిట్ స్కోర్ ఎలా మేనేజ్ చేసుకోవాలనేది కూడా స్పష్టంగా చెప్పారు.ఈ వెబినార్‌లో పాల్గొన్న మహిళల ఆర్థిక సందేహాలను నివృత్తి చేశారు.వారిలోసరికొత్త ఆర్థిక ఉత్సాహాన్ని నింపారు.

వెబినార్స్‌కు మాధవి దొడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మహిళలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన కుటుంబాల్లో సంతోషాలకు కొదవ ఉండదనే భావనతోనే నాట్స్ మహిళల ఆర్థిక అక్షరాస్యతపై దృష్టిసారించిందని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు.నాట్స్ ఇక ముందు మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలుచేపడుతుందని ఆమె తెలిపారు.

ఈ వెబినార్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన జయశ్రీ పెద్దిబొట్ల, జ్యోతి వనం, లక్ష్మి బొజ్జ, బిందు యలమంచిలి, పద్మజ నన్నపనేని, ఆషా వైకుంఠం, ఉమ మాకం, గీత గొల్లపూడి లను నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube