Harish Rao : కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు..: ఎమ్మెల్యే హరీశ్ రావు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.ఇందులో భాగంగానే ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని( Congress Govt ) నిలదీస్తారని చెప్పారు.

కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ప్రజా నాయకుడని తెలిపారు.14 ఏళ్లు పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ప్రజా సమస్యలపై కూడా ఎక్కడా రాజీ పడకుండా నిరంతర పోరాటం చేస్తారని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్( Telangana congress ) అధికారంలోకి వచ్చిన తరువాత మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని ఆయన ఆరోపించారు.తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మరియు తెలంగాణ ప్రజలు కోసం కేసీఆర్( KCR ) పోరాటం చేస్తారని స్పష్టం చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు