కేసీఆర్ మదిలో ' ముందస్తు ' ? ఆగస్ట్ లో క్యాబినెట్ ప్రక్షాళన ?

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా యాక్టివ్ అయ్యారు.

గతంతో పోలిస్తే రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు , తెలంగాణ అంతటా పర్యటనలు చేస్తూ, ఎక్కడా టిఆర్ఎస్ పార్టీ పట్టు చేజారిపోకుండా చూసుకుంటున్నారు.

కొత్తగా కాంగ్రెస్ బీజేపీల నుంచి రాజకీయ శత్రువులు బలపడడం, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి కేబినెట్ ర్యాంకు దక్కడం, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కడం,  అలాగే ఉద్యమ నేపథ్యం ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం,  ఇలా ఎన్నో అంశాలు కేసీఆర్ ను కలవరపెడుతున్నాయి.మొన్నటి వరకు కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో అంతంతమాత్రంగానే ఉన్నా,  రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ లో కనిపించిన ఉత్సాహం కేసీఆర్ ను మరింత కంగారు పెడుతోంది.

ప్రతిపక్షాలు మరింతగా బలం పుంజుకోక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలన్నదే కేసీఆర్ అభిప్రాయం గా ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.గతంలోనూ కేసీఆర్ ముందస్తు ఎన్నికలను నమ్ముకునే ప్రతిపక్షాలకు అవకాశంలేకుండా విజయాన్ని సాధించారు ఎప్పుడు అదే ఫార్ములాను ఉపయోగించుకుంటే తనకు తిరుగు ఉండదని , ప్రతిపక్షాలు బలపడే ఛాన్స్ ఇవ్వకూడదనే లెక్కల్లో కెసిఆర్ ఉన్నారు.

అంత కటే  క్యాబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తున్నారట.పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా కలిసి రాని మంత్రులతోపాటు, తమపై అసంతృప్తితో ఉన్న పార్టీకి చేటు తెస్తున్న , ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని పూర్తిగా పక్కన పెట్టి,  చురుకైన యువ మంత్రులకు మంత్రి పదవులు కట్టబెట్టాలనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.అయితే ఈ కొత్త మంత్రివర్గంలో ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత కు కీలకమైన మంత్రిత్వశాఖ దక్కే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి కి అవకాశం ఉండబోతున్నట్లు సమాచారం .తెలంగాణలో మారిన సమీకరణాల నేపథ్యంలో కులాల వారీగా ప్రాధాన్యం ఇచ్చే విధంగా కొత్త మంత్రి మండలిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కెసిఆర్ ఉన్నారట.దీనికి సంబంధించిన కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది.

అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యవహారశైలిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.అలాగే గ్రేటర్ కు చెందిన ఇంకో మంత్రి పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడం తదితర కారణాలతో అటువంటి వారందరినీ తప్పించబోతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ముందు ముందు కెసిఆర్ సంచలన నిర్ణయాలు తీసుకునే విధంగానే కనిపిస్తున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు