కౌశిక్‌ను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తున్న రేవంత్‌..

తెలంగాణ రాజ‌కీయాల్లో హుజూరాద్ ఉప ఎన్నిక ఎంత‌లా ఎఫెక్ట్ చూపిస్తుందో చూస్తూనే ఉన్నాం.నోటిఫికేష‌న్ రాక‌ముందే ఎన్నో ట్విస్టులు ఇచ్చిన ఉప ఎన్నిక ఇది.

 Rewanth Is Indirectly Targeting Kaushik Kaushik, Revanth , Ts Poltic , Ts Congre-TeluguStop.com

ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తామంటూ ప్ర‌క‌టించిన కౌశిక్‌రెడ్డి చివ‌ర‌కు టీఆర్ ఎస్‌లో చేరి కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయ‌న మీద చాలా సీరియ‌స్‌గా ఉంది.

ఇక ఆయ‌న వెళ్లిపోయిన త‌ర్వాత అస‌లు కాంగ్రెస్‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు బ‌ల‌మే లేకుండా పోయింద‌నే చెప్పాలి.ఆయ‌న వెంటే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కూడా పార్టీని వీడారు.

ఆ త‌ర్వాత అస‌లు కాంగ్రెస్‌కు అభ్య‌ర్థి దొర‌క‌డ‌మే ఎంత క‌ష్టం అయిందో చూస్తూనే ఉన్నాం.ఇలాంటి త‌రుణంలో రేవంత్‌రెడ్డి చాలా లేటుగా బాల్మూరి వెంకట్ ను బ‌రిలోకి దించిన సంగ‌తి తెలిసిందే.

ఇక వెంక‌ట్ గెలుపుకోసం స్వ‌యంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారంటే ఆయ‌న దీన్ని కొంచెం సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు అర్థం అవుతోంది.ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు రీసెంట్ గా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇందులో ప‌రోక్షంగా కౌశిక్‌ను టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపించింది.కాంగ్రెస్‌ను ఇప్ప‌టికే చాలామంది మోసం చేశార‌ని వ్యాఖ్యానించారు.

Telugu Balmuru Venkat, Etela, Huzurabad, Kaushik, Revanth, Revanth Reddy, Trs, T

ఇక ప‌రోక్షంగా కౌశిక్ గురించి మాట్లాడుతూ ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఒకాయ‌న టీఆర్ఎస్‌లోకి పోతే ఎమ్మెల్సీ వస్తుందని ఆవ‌ప‌డ్డాడ‌ని చివ‌ర‌కు ప‌ద‌వి రాక‌, డ‌బ్బులు రాక దీన స్థితిలో ప‌డ్డాడంటూ వ్యాఖ్యానించారు.అంతే కాదు కాంగ్రెస్ ను ఎవ‌రు మోసం చేసినా స‌రే వారు క‌చ్చితంగా కసబ్ తో సమానమంటూ కౌశిక్ మీద సంచ‌ల‌న కామెంట్లు చేశారు.ఇక హుజూరాబాద్‌లో కేసీఆర్ ఆడుతున్న గేమ్‌లో హ‌రీశ్ రావు బ‌క‌రా అవుతారంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్‌, బీజేపీ రెండూ ఒక‌టేన‌ని వారిని ప‌క్క‌న పెట్టాలంటూ కోరారు రేవంత్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube