కోదాడ నుండి హైదరాబాద్ కు కాషాయ దళం

సూర్యాపేట జిల్లా:హైదరాబాదులో జరుగుతున్న విజయ సంకల్పయాత్ర బహిరంగ సభకు కోదాడ పట్టణం నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ బహిరంగ సభకు బయలుదేరిన 10 వాహనాల వాహనశ్రేణిని బీజేపీ సీనియర్ నాయకులు కనగాల వెంకట్రామయ్య జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన,జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ వంగవీటి శ్రీనివాస్,రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ కార్యదర్శి కనగాల నారాయణ,దళిత మోర్చా జిల్లా నాయకులు వంగాల పిచ్చయ్య,చిట్టిబాబు, మునగాల శ్రీనివాస్,ఎరగాని రాధాకృష్ణ,దేవరశెట్టి సత్యనారాయణ,ఉడుత విశ్వనాథం,దేవునురి లక్ష్మి, కుదుమురి ఈశ్వరరావు,దుస్సా వెంకటేష్,రౌతు జగన్,మధు,బద్రిపుల్లారావు,సురేష్,శ్రీను,వెంకటేష్ తదితరులు తరలివెళ్లారు.

Latest Suryapet News