రేపు ఉమ్మడి నల్లగొండకు వస్తున్న జనసేనాని

నల్లగొండ జిల్లా:ఈ నెల 20న ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్,కోదాడలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.ఈ మధ్య కాలంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పవన్ పరామర్శించి,వారికి రూ.

5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు అందచేస్తారని తెలుస్తోంది.20వ తేదీ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుండి బయలుదేరతారు.మెట్టుగూడ అంటేడ్కర్ చౌరస్తా,ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం చేరుకుంటారు.

అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్పిస్తారు.ఆ తరవాత కోదాడకు వెళ్లి అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్పిస్తారని సమాచారం.

జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

వీడియో వైరల్‌ : మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌
Advertisement

Latest Nalgonda News