96 మ్యాజిక్‌ను జాను రిపీట్‌ చేసిందా? జాను మూవీ రివ్యూ అండ్ రేటింగ్

తమిళంలో క్లాసికల్‌ హిట్‌గా నిలిచిన 96 ను తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నట్లుగా ప్రకటించిన వెంటనే చాలా మంది దిల్‌రాజుపై విమర్శలు చేశారు.

అలాంటి సినిమాలను రీమేక్‌ చేయాలనుకోవడం ఆయన కెరీర్‌లోనే పెద్ద తప్పు అంటూ వ్యాఖ్యలు చేశారు.

సమంత మరియు శర్వాలకు ఇష్టం లేకున్నా కూడా దిల్‌రాజు బలవంతంగా ఈ చిత్రంలో నటింపజేశాడు.మరి అంత నమ్మకంతో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా ఫలితం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

కథ దాదాపుగా అందరికి తెల్సిందే.స్కూల్‌ డేస్‌లో రామ్‌-శర్వానంద్‌, జాను-సమంత లు ప్రేమించుకుంటారు.

కాని వారు ఒకరి ప్రేమను ఒకరికి చెప్పుకోలేరు.స్కూల్‌ డేస్‌ పూర్తి అయ్యి చాలా సంవత్సరాలు అయిన తర్వాత స్కూల్స్‌ ఫ్రెండ్స్‌ రీ యూనియన్‌ ఏర్పాటు చేసుకుంటారు.

Advertisement

ఆ సమయంలో రామ్‌, జానుల మనోభావాలు ఏంటీ? అన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్న వారు ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? ఆ సమయంలో వారి మద్య భావోద్వేగ సీన్స్‌ ఎలా ఉంటాయి అనేది సినిమా కథాంశం.

నటీనటుల నటన:

శర్వానంద్‌ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నిరూపించుకున్నాడు.రామ్‌ పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటించాడు.

అద్బుతమైన ఫీల్‌తో శర్వానంటించి మెప్పించాడు.ఇక సమంత కెరీర్‌ బెస్ట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సమంత ఓ బేబీ చిత్రం తర్వాత అంతకు మించిన నటన మరియు ఎమోషన్స్‌ను ఈ చిత్రంలో చూపించింది.జానులాంటి పాత్రలను అందరు హీరోయిన్స్‌ చేయలేరు.

త్రిష తమిళంలో చేసిన సమయంలో ఆ స్థాయిలో చేయగలదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని త్రిషను ఏమాత్రం గుర్తుకు తీసుకు రాకుండా సొంతంగానే జాను పాత్రపై ముద్ర వేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రోజా పొలిటికల్ సైలెన్స్ అందుకేనా ? 

ఇక వర్ష నటన చాలా బాగుంది.వెన్నెల కిషోర్‌ నటన ఆకట్టుకునే విధంగా ఉంది.

Advertisement

ఇక మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

టెక్నికల్‌ :

నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను పీక్స్‌కు తీసుకు వెళ్లింది.ఫీల్‌ మిస్‌ అవ్వొద్దనే ఉద్దేశ్యంతో తమిళంలో వాడిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌నే ఎక్కువగా ఇక్కడ వాడారు.

ఇక పాటలు కూడా పర్వాలేదు.సినిమాటోగ్రఫీ బాగుంది.

ముఖ్యంగా శర్వా ప్రారంభ సీన్స్‌లో అద్బుతమైన సినిమాటోగ్రఫీ పనితనం కనిపించింది.ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.

కొన్ని సీన్స్‌ను సాగతీసినట్లుగా అనిపించింది.దర్శకుడు రీమేక్‌ అయినా ఫీల్‌ మిస్‌ అవ్వకుండా జాగ్రత్తగా తీశాడు.

విశ్లేషణ:

తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి.కాని అందులో కొన్ని అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి.

అలాంటి జాబితాలోకే జాను వెళ్తుందేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.క్లాసిక్‌ మూవీని టచ్‌ చేస్తున్నందుకు దిల్‌రాజుకు పెద్ద గుణపాఠంను ప్రేక్షకులు చెప్తారని అనుకున్నారు.

కాని సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది.అద్బుతమైన స్పందన దక్కించుకుంటుంది.

ఆ ఫీల్‌ ఏమాత్రం మిస్‌ కాకుండా కేవలం తెలుగు నేటివిటీని అద్ది ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు.ఎక్కువ మార్పులు చేయకుండా రీమేక్‌ చేయడంతో పాటు జాను, రామ్‌ పాత్రలకు సరిగ్గా సూట్‌ అయ్యేలా శర్వా, సామ్‌లను తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు.

సినిమా కాస్త స్లో అనిపించినా కూడా ఫీల్‌గుడ్‌ మూవీ.

ప్లస్‌ పాయింట్స్‌:

ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే సీన్స్‌ శర్వానంద్‌, సమంతల నటన, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఎమోషనల్‌ సీన్స్‌ కొన్ని కామెడీ సీన్స్‌ ఫ్ల్యాష్‌ బ్యాక్‌ వ్‌ సీన్స్‌

మైనస్‌:

కాస్త స్లోగా కథనం నడవడం, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం

బోటమ్‌ లైన్‌:

96 ఫీల్‌ మిస్‌ చేయకుండా జానును తీసుకు వచ్చారు

రేటింగ్‌ : 3.25/5.0

తాజా వార్తలు