శాన్ ఫ్రాన్సిస్కో: అండర్‌వేర్‌తో కారు క్లీన్ చేస్తే నేరమట.. కారణం తెలిస్తే షాకవుతారు!

ప్రపంచంలో కొన్ని చట్టాలు వింతగా ఉంటాయి.

శాన్ ఫ్రాన్సిస్కో( San Francisco ) నగరంలోనూ అలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిలో ఒక చట్టం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.అదేంటంటే, అక్కడ ఎవరైనా తమ కారుని( Car ) అండర్‌వేర్‌తో( Underwear ) తుడిస్తే ఫైన్ కట్టాల్సిందే.ఇది సెక్షన్ 694 ప్రకారం నేరం.

దానికి కారణమేంటో రూల్స్ పెట్టిన వారికే తెలియాలి.అంతే కాదు, అక్కడ గుడ్డలు ఉతికే విషయంలో కూడా రూల్స్ ఉన్నాయి.

మురికి గుడ్డలు అమ్మాలన్నా, శుభ్రం చేయాలన్నా వాటిని కచ్చితంగా 5 శాతం కాస్టిక్ సోడా కలిపిన నీళ్లలో 40 నిమిషాలు మరిగించాలట, శాన్ ఫ్రాన్సిస్కో పెట్టిన ఈ వింత చట్టాలు( Strange Laws ) విని అందరూ అవాక్కవుతున్నారు.ఈ నగరం కల్చర్, ఎకానమీ పరంగా చాలా ముఖ్యం.

కాలిఫోర్నియాలో( California ) ఇది నాలుగో పెద్ద నగరం.అమెరికాలో అయితే 17వ స్థానంలో ఉంది.2021 లెక్కల ప్రకారం ఇక్కడ 8 లక్షల 15 వేల మందికి పైగా జనాభా ఉన్నారు.అండర్‌వేర్ రూల్‌తో పాటు ఇంకా చాలా చిత్రమైన రూల్స్ ఉన్నాయి.

ఉదాహరణకు, పబ్లిక్ టాయిలెట్‌లోకి( Public Toilet ) 13 ఏళ్ల పైబడిన ఒక్కరే వెళ్లాలి.ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే తప్ప ఇద్దరికి అనుమతి లేదు.వీధుల్లో పావురాలకు గింజలు వేయడం కూడా నేరం.

అక్కడక్కడా బోర్డులు కూడా పెట్టారు, "పావురాలకు ఆహారం వేయకూడదు" అని దానిపై రాసి ఉంటుంది.

అంతేకాదు, ఒకేసారి తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ కుక్కల్ని తోలుకుంటూ వెళ్లకూడదు.కుక్కలు( Dogs ) కారు అద్దాల్లోంచి తల బయటపెట్టకూడదు.బ్రెడ్, కేకులు, పేస్ట్రీలు చేత్తో పట్టుకుని తింటూ తిరగడం కూడా రూల్స్‌కు విరుద్ధం.

పిల్లలకు లేజర్ పాయింటర్లు అమ్మడం కూడా నిషేధం.చివరిగా ఇంకో విచిత్రమైన రూల్ ఏంటంటే, చనిపోయిన వారి శరీరాన్ని డబ్బు కోసం ఎగ్జిబిషన్‌లో పెట్టకూడదు.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్... తన సలహా తప్పనిసరి అంటూ?
కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!

ఒకవేళ పెట్టాలంటే చనిపోయే ముందు వాళ్లు రాతపూర్వకంగా అనుమతి ఇచ్చి ఉండాలి.చూశారుగా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంత వింతైన రూల్స్ ఉన్నాయో, కొన్ని రూల్స్ బాగానే ఉన్నా, చాలా వరకు వింతగా, నవ్వొచ్చేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు