ఒంటరిగా ఉన్నావా బాబూ.. స్కామర్‌తో ఆడేసుకున్న వాయిస్ ఆర్టిస్ట్.. వీడియో చూస్తే నవ్వాగదు..

బ్యాంకుల నుంచి లోన్ ఆఫర్లంటూ వచ్చే స్పామ్ కాల్స్( Spam Call ) ఎంత చిరాకు తెప్పిస్తాయో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.చాలామంది వాటిని విసుక్కుంటూ వెంటనే కట్ చేస్తుంటారు.

 Voice Artist Pranks Scam Caller Offering Credit Card Video Viral Details, Prank-TeluguStop.com

కానీ తాన్య నంబియార్( Tanya Nambiar ) అనే ఓ వాయిస్ ఆర్టిస్ట్ మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించింది.స్పామ్ కాల్ చేసిన వ్యక్తికే ఎదురు తిరిగి షాక్ ఇచ్చింది.

తను చేసిన ప్రాంక్ వీడియోను( Prank Video ) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది వైరల్ అయిపోయింది.

ఆ వీడియోలో తాన్యకు ఓ బ్యాంకు ఎంప్లాయ్ ఫోన్ చేసి క్రెడిట్ కార్డు( Credit Card ) ఆఫర్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

సాధారణంగా అయితే చాలామంది వద్దని చెప్పేస్తారు.కానీ తాన్య మాత్రం వాయిస్ మార్చి అతన్ని ఆటపట్టించడం మొదలుపెట్టింది.ఆ వ్యక్తి “మీకు క్రెడిట్ కార్డు కావాలా మేడమ్?” అని అడిగితే, తాన్య వెంటనే “నువ్వు ఒంటరిగా ఉన్నావా బాబూ? నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తారా?” అంటూ తిక్క ప్రశ్నలు వేసింది.

అంతేకాదు, “నాతో మాట్లాడాలని ఉంటే ఒకటి నొక్కండి” అని చెప్పడంతో ఆ స్పామ్ కాలర్ నిజంగానే ఒకటి నొక్కాడు.ఆ తర్వాత తాన్య మరింత రెచ్చిపోవడంతో విసిగిపోయిన ఆ వ్యక్తి బూతులు తిడుతూ ఫోన్ పెట్టేశాడు.

తాన్య చేసిన ఈ ప్రాంక్ వీడియో నెటిజన్లను కడుపుబ్బ నవ్వేలా చేస్తోంది.దీనికి లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చాయి.చాలామంది ఇలాంటి ప్రాంక్‌లు తామూ చేస్తామని కామెంట్లు పెడుతున్నారు.

ఒకరైతే ఇన్సూరెన్స్ వాళ్లు “ప్రాణాలు కాపాడటానికి” ఫోన్ చేస్తారంటూ జోక్ చేశాడు.ఇంకొకరు తాన్య స్పామ్ కాల్స్‌పై ఒక సిరీస్ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు.

ఇదంతా సరదాగా ఉన్నా, తాన్య వీడియో స్పామ్ కాల్స్ సమస్య ఎంత ఎక్కువైందో తెలియజేస్తోంది.వీటిని అరికట్టడానికి భారత ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక తాన్య చేసిన ఫన్నీ వీడియో ఒక బాధాకరమైన సమస్యకు కాస్త రిలీఫ్ ఇచ్చినా స్పామ్ కాల్స్, స్కామ్‌ల విషయంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube