రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో రూ.7 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ పనులను నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.

పనుల్లో జాప్యం,డైవర్షన్‌ రోడ్డు సరిగా లేకపోవటంతో రైల్వే అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపి ఉత్తమ్,రైల్వే జీఎం ఏ.కె.జైన్‌తో మాట్లాడి,రైల్వే అండర్‌ పాస్‌ను త్వరగా పూర్తి చేయాలని మరియు డైవర్షన్ రోడ్డును మెరుగుపరచాలని కోరారు.అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ 2022 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని రైల్వే జీఎం హామీ ఇచ్చారని అన్నారు.

డైవర్షన్ పనులను కూడా త్వరితిగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

It Is Best To Examine Railway Underpass Works-రైల్వే అండర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?

Latest Suryapet News