Akhanda 2 : బాలయ్య అఖండ2 మూవీ కథ ఇదేనా.. మరీ ఈ రేంజ్ లో సినిమాను ప్లాన్ చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య( Nandamuri Balakrishna ) ఒకప్పుడు ఎంత రేంజ్ లో దూసుకెళ్లాడో ఇప్పుడు కూడా అంతే రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.

తన ఎనర్జీ గురించి ఆలోచించకుండా వచ్చిన సినిమాలకు సైన్ చేస్తూ వరుస హిట్ లు అందుకుంటున్నాడు.

యంగ్ హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.ఇక గత ఏడాది బోయపాటి శ్రీను(Boyapati Srinu ) దర్శకత్వంలో విడుదలైన అఖండ సినిమాతో కెరీర్ పరంగా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.ఇక అఖండ సినిమా తర్వాత మరో సినిమాలో బిజీగా మారాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరో సినిమా, వెంకీ అట్లూరితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా వరుస సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.

Advertisement

మొత్తానికి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.అయితే తాజాగా అఖండ 2 ( Akhanda 2 )సినిమాకు సంబంధించిన కథ గురించి తెలిసింది.గతంలో ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో అప్పటినుండి బాలయ్య అభిమానులు ఈ సినిమా అప్డేట్ గురించి బాగా ఎదురుచూస్తున్నారు.

దీంతో ఈ నేపథ్యంలో పార్ట్ 2 కు సంబంధించిన కథ గురించి తెలియటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే కథ ఏంటంటే.ఓ స్వార్థపరుడి చేతిలో పడి నాశనం అవుతున్న ప్రజలను, ముఖ్యంగా తిరుమలేశుని ప్రతిష్టను తగ్గించే కార్యక్రమాలు చేసే వ్యక్తులను హీరో అంతం చేస్తాడు అని తెలిసింది.

అంతేకాకుండా ఇతర మతస్థుడు నాయకుడు కావడంవల్ల దేవాలయాలపై ఎలాంటి దాడులు జరుగుతాయి అనేది.వాటిని అరికట్టడానికి హీరో ఏం చేస్తాడు అనేది కథలో ఉన్నట్టు తెలుస్తుంది.అంటే ఈ సినిమా పొలిటికల్ అంశాలతో కూడా ఉండబోతుందని అర్థమవుతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

ఇక ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడే భారీ అంచనాలు వెలువడగా.జూన్ 10 బాలయ్య పుట్టినరోజున ఈ సినిమా గురించి అధికారంగా ప్రారంభిస్తే ఈ సినిమాపై ఇంకెంతలా అంచనాలు పెంచుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు