బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలతో అదే విధంగా రేవంత్ రెడ్డి పాదయాత్రతో రాజకీయాలు రంజుగా మారిన పరిస్థితులలో షర్మిల పొలిటికల్ ఎంట్రీని మరింత హీటెక్కించింది.ఆంధ్రా పార్టీలను ఆంధ్రా పాలకుల పాలనపై తీవ్ర వ్యతిరేకత కలిగి ఉన్న తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వై.
ఎస్.రాజశేఖర్ రెడ్డి, అదే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి సోదరిగా ఉన్న షర్మిల స్థాపించే పార్టీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకోవడం పెద్ద సాహసమైన అడుగే అని చెప్పవచ్చు.
ఆంధ్ర వారిపై ఇంత వ్యతిరేకత కలిగి ఉన్నా షర్మిలకు తన పార్టీ ని ఆదరిస్తారని బలమైన నమ్మకం ఉండడానికి కారణం, అంతేకాక ఆంధ్ర పాలకుల పట్ల వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తన పార్టీ పై ప్రజలకు వ్యతిరేకత రాకుండా షర్మిల మాస్టర్ ప్లాన్ వేసింది.షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఖమ్మం వ్యక్తి కావడంతో నేను తెలంగాణ బిడ్డను అనే సెంటిమెంట్ ను ప్రజలకు కలిగించి ప్రజల వ్యతిరేకత నుండి తప్పించుకోవచ్చనే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది.
చూద్దాం మరి షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాల్సి ఉంది.