చెప్పు దెబ్బకు సంకినేని సిద్ధమేనా?

సూర్యాపేట జిల్లా:పదే పదే తనపై,తన ఏజెన్సీపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుకు టీఆర్ఎస్ నాయకుడు,ఇమాంపేట ఎంపిటిసి మామిడి కిరణ్ సవాల్ విసిరారు.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏజెన్సీ ద్వారా అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని సంకినేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని,తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రజా క్షేత్రంలో చెప్పు దెబ్బకు సిద్ధమని,తనపై ఆరోపణలు నిరూపించపోతే సంకినేని చెప్పు దెబ్బకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడాతూ అన్ని అర్హతలు కలిగిన వారికే ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.

Is Sankineni Ready For The Sandal Blow?-చెప్పు దెబ్బకు

తనపై ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు.తాను దళిత వర్గానికి చెందిన వాడినని తనకు కష్టాలు తెలుసన్నారు.

బలహీనుడునని అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.సంకినేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడి వేల కోట్లకు ఎదిగింది నిజం కాదా ప్రశ్నించారు.

Advertisement

తన ఉనికి కోసం ఇతరులపై ఆరోపణలు సరికాదని హితవు పలికారు.తనపై ఆరోపణలు నిరూపించకపోతే సంకినేని ఇంటి ముందు చావు డప్పు కొట్టడం తప్పదన్నారు.

సమావేశంలో జెడ్పిటిసి జీడి భిక్షం, మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి,వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు,నాయకులు మాలి అనంతరెడ్డి,వంకుడొతు నాగరాజు,సంకరమద్ది రమణా రెడ్డి,శంకర్ నాయక్,గొర్ల గన్నారెడ్డి, రమేష్,తిరుమల,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News