చైనా ప్రపంచ దేశాలను ముంచింది అంటూ అంతర్జాతీయ కోర్టు లో పిటీషన్

కరోనా మహమ్మారి చైనా లో ప్రారంభమై ఈ రోజు ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.

ఈ కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 22 లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకగా,దాదాపు లక్షా 50 వేల మందికి పైగా మృతి చెందారు.

అయితే కరోనా మహమ్మారి పై చైనా తప్పుడు సమాచారమే ఇంతటి అనర్ధానికి కారణం అంటూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)లో చైనా కు వ్యతిరేకంగా ముంబై కి చెందిన లాయర్ ఆశిష్ సోహాని కేసు పెట్టినట్లు తెలుస్తుంది.కరోనా వైరస్ మృతుల లెక్కల్ని 50 శతం తక్కువగా చూపించి ప్రపంచ దేశాలకు ఈ వైరస్ పై తక్కువ అంచనా ఏర్పడేలా చేసింది అని దాని ఫలితంగా ఆయా దేశాలు ఈ వైరస్ ని లైట్ తీసుకొవడం తో ఇంతటి అనర్ధం చోటుచేసుకుంది అంటూ పిటీషనర్ పేర్కొన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కి యూరప్ దేశాలు,అమెరికా దేశం అల్లాడిపోతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50 వేలమందికి పైగా మృతి చెందగా దానిలో ఒక్క అమెరికా లోనే 38 వేలమందికి పైగా మృతి చెందడం గమనార్హం.

ఇంతగా ప్రపంచ దేశాలను ప్రమాదంలోకి నెట్టేసిన చైనా పై ముంబై కి చెందిన లాయర్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.చైనా తన దేశంలో వచ్చిన కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యకపోగా.

Advertisement

ఆ వైరస్ ప్రపంచ దేశాలకు పాకేలా చేసిందని తన పిటిషన్‌లో తెలిపారు.మొత్తం 33 పేజీల పిటిషన్‌లో.

భారత్‌కి చైనా వల్ల జరిగిన నష్టానికి.చైనా.రూ.190 లక్షల కోట్లు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.నిజానికి తమ దేశంలో కరోనా కేసులు బయటపడినప్పటి నుంచి చైనా ప్రపంచ దేశాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంది.

డిసెంబర్ 21న తమ దేశంలో నిమోనియా లాంటి వ్యాధి ఒకటి వుహాన్ నగరంలో ప్రబలుతోందని తెలిపింది.

అలాగే.కరోనా వైరస్ ఎలా ఉంది, దాని జన్యు క్రమం ఏంటి? ఎలా వ్యాపిస్తోంది? ఇలా ఎంతో సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించింది.ఐతే.వాస్తవాల్ని దాచేసి.వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపిందనే వాదన అమెరికా సహా చాలా దేశాల నుంచి వస్తోంది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను...స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

కొన్ని దేశాలు అయితే ఇది ఒక పెద్ద బయోవార్ అంటూ వ్యాఖ్యానిస్తున్నాయి కూడా.ఏది ఏమైనా చైనా చేసిన కుట్ర వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఇంత మంది ప్రాణాలు పోతున్నాయంటూ ఆరోపిస్తున్న ముంబై లాయర్ఇం దుకు చైనాకి శిక్ష పడి తీరాల్సిందే అంటూ తన పిటిషన్‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు