సౌందర్య మూడో సినిమా 27వ సినిమాగా విడుదలైంది.. అసలేం జరిగిందంటే?

స్టార్ హీరోయిన్ సౌందర్య సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అమ్మోరు సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే ఏకంగా ఒక కోటీ 20 లక్షల రూపాయలు ఖర్చైంది.

టాలీవుడ్ సినిమాలలో గ్రాఫిక్స్ కు శ్రీకారం చుట్టిన మూవీ అమ్మోరు కావడం గమనార్హం.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఏకంగా నాలుగు సంవత్సరాల సమయం పట్టింది.

అందువల్ల సౌందర్య మూడో సినిమాగా మొదలైన ఈ సినిమా 27వ సినిమాగా రిలీజైంది.అమ్మోరు సినిమా కొరకు సౌందర్య అప్పట్లోనే ఏకంగా 180 రోజుల కాల్షీట్లు ఇవ్వడం గమనార్హం.

నటిగా సౌందర్యకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.సౌందర్య కెరీర్ లోని ల్యాండ్ మార్క్ సినిమాలలో అమ్మోరు సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.

Advertisement
Interesting Facts About Start Heroine Soundarya Ammoru Movie Details, Ammoru Mov

అంచనాలను మించిన బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాలో అమ్మోరు వేషంలో రమ్యకృష్ణ నటించారు.

ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణకు దేవతల పాత్రలు పోషించడానికి ఎన్నో సినిమాలలో ఆఫర్లు వచ్చాయంటే ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

Interesting Facts About Start Heroine Soundarya Ammoru Movie Details, Ammoru Mov

సురేష్ అమ్మోరు సినిమాలో హీరో రోల్ లో నటించగా రామిరెడ్డి ఈ సినిమాలో విలన్ గా నటించారు.బేబీ సునైనా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు.ఈ సినిమా తర్వాత దర్శకుడు కోడి రామకృష్ణకు సినిమా ఆఫర్లు ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం.

Interesting Facts About Start Heroine Soundarya Ammoru Movie Details, Ammoru Mov

ఆ తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో దేవి, అంజి, దేవీపుత్రుడు లాంటి గ్రాఫిక్స్ ప్రాధాన్యత చిత్రాలు తెరకెక్కగా ఈ సినిమాలలో కొన్ని సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఆ తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన అరుంధతి మూవీ ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు