నల్గొండ జిల్లా పలివెలలో తీవ్ర ఉద్రిక్తత

నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు.

 Intense Tension In Palivela Of Nalgonda District-TeluguStop.com

అది కాస్తా ముదరడంతో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు.ఈ దాడుల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఈటల రాజేందర్ కార్లు ధ్వంసం అయ్యాయి.

అయితే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఈటల రాజేందర్ ప్రచారం చేస్తుండగా ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.ఈ రాళ్ల దాడిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.

రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube