కరోనాకి ముందు కేవలం ఫారిన్ కంట్రీలకే పరిమితమైన OTT ప్లాట్ ఫామ్స్ కరోనా తరువాత ఇండియాలోకి దూసుకువచ్చాయి.ఇప్పుడు ఇక్కడ సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే, సినిమా బావుంటే తప్ప, ఇక్కడ ఎవరూ థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడాల్సిన పరిస్థితి లేదు.
ఈ క్రమంలో Netflix, Amazon, Disney + Hotstar వంటి OTTలకు మంచి డిమాండ్ ఏర్పడింది.అవిగాక కొన్ని లోకల్ OTTలు పుట్టుకొచ్చాయి.
అందులో ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుడు అయినటువంటి అల్లు అరవింద్ ‘ఆహా’ OTT మంచి ఫామ్ లో వుంది.
ఇక అసలు విషయానికొస్తే, ప్రముఖ దిగ్గజ OTT Netflix తన వినియోగదారులకు షాక్ ఇవ్వబోతోంది.
Netflix OTTల అన్నింటిలో ముందంజలో ఉందని సెప్పుకోవచ్చు.ఇందులో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్, TV కార్యక్రమాలు, సెలెబ్రిటీ షోలు అనేక ప్రసారం అవుతాయి.
ఇందులో ముఖ్యంగా కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు, వెబ్ సిరీస్‌లను యూజర్లు ఎక్కువగా చూస్తూ వుంటారు.తాజాగా ఈ OTT తన కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది.
బేసిగ్గా ఏదైనా ఒక OTTను సబ్ స్క్రైబ్ చేసుకుంటే.దాని పాస్ వర్డ్స్ ముగ్గురు నుండి నలుగురు వరకు షేర్ చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ వెసులుబాటుకి Netflix చెక్ పెట్టనుంది.ఇకనుండి అలా చేయాలన్నా డబ్బులు పే చేయాల్సి రావచ్చు.ఒకప్పుడైతే దానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వర్తించేవి కావు.కానీ నేటినుండి అలాంటి పప్పులు ఉడకవు.కాగా ఈ సంస్థ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.OTTలో పెరుగుతున్న పోటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ప్లాన్‌ల చార్జీలు అధికంగా ఉండడం కారణంగా ఇప్పటికే లక్షల్లో సబ్‌స్క్రైబర్లును ఇది కోల్పోయింది.
ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్‌ని తీసుకురాబోతోంది నెట్ ఫ్లీక్స్.గతంలో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌కి నగదు చెల్లించి ఆ పాస్‌వర్డ్ ఇతరులకు షేర్ చేసేవాళ్లు.
ఇకపై అలా కుదరదు