Indraja Husband: ఎవరు చేయని త్యాగం చేస్తున్న ఇంద్రజ భర్త.. ఏంటో తెలుసా ?

రజతి అలియాస్ ఇంద్రజ.ఈమె ఒకప్పటి యూత్ కి కలల దేవత.

చిన్న హీరోల నుంచి అగ్ర హీరోల వరకు అందరితో కలిసి నటించింది.

తెలుగు, మలయాళ సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో నటించిన, కన్నడ మరియు తమిళ్ లో సైతం మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లోనే నటించింది.

తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇంద్రజ చిన్నతనం నుంచి కర్నాటిక్ సంగీతం లో శిక్షణ పొందింది.స్కూల్ డేస్ నుంచే సింగర్ గా ఇంద్రజ తన ప్రతిభ ఏంటో చూపిస్తూనే కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకుంది.

అజయ్ప్పలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఇంద్రజ హలో బ్రదర్ మరియు పురుష లక్షణం సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.ఇక జంతర్ మంతర్ సినిమాతో తెలుగులో మెయిన్ లీడ్ గా డెబ్యూ చేసింది.

Advertisement

తెలుగు లో ఎక్కువగా అలీ తో హీరోయిన్ గా సక్సెస్ కొట్టిన ఇంద్రజ కృష్ణ వంటి స్టార్ హీరో సరసన సైతం ఆడి పాడింది.ఇక కెరీర్ లో వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఇంద్రజ బుల్లి తెర పై కూడా బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగింది.

ఇక రియాలిటీ షోలకు జడ్జి గా కూడా వ్యవహరిస్తున్న ఇంద్రజ ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మ ఇచ్చిది.ఇక తమిళ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ఆమె తోటి నటుడు అయినా మొహమ్మద్ అబ్సర్ తో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది.

ఇతడు ఒక కేరళ కు చెందిన ముస్లిం.కానీ బ్రాహ్మణ అమ్మాయి అయినా ఇంద్రజ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకోవడం చాల పెద్ద విషయమని చెప్పాలి.

కానీ అబ్సర్ ప్రేమ ముందు ఆమె అందరిని వద్దనుకుని అతడినే పెళ్లి చేసుకుంది.అబ్సర్ మాత్రమే కాదు అతడి కుటుంబం కూడా ఇంద్రజను బాగా ప్రేమిస్తారు.ఎంతలా అంటే ఇంద్రజ బ్రాహ్మిన్ కాబట్టి మాంసాహారం తినదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఆమె కోసం ఆమె కుటుంబం మొత్తం మాంసాహారం మానేశారట.ఇంద్రజ ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి నేటి వరకు వారింట్లో నాన్ వెజ్ వండలేదు అంటూ గర్వంగా చెప్పుకుంటుంది ఇంద్రజ.

Advertisement

అయితే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట.మరి వీరి ప్రేమ ఇలాగె కలకాలం ఉండాలని కోరుకుందాం.

తాజా వార్తలు