గురుద్వారాలో ఘర్షణ .. బెల్జియంలో భారత సంతతి సిక్కు మృతి

బుధవారం రాత్రి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఒక గురుద్వారాలో విషాదం చోటు చేసుకుంది.ఓ గొడవలో భారతీయ సిక్కు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని పంజాబ్‌లోని ఫగ్వారాకు చెందిన 52 ఏళ్ల భక్తవర్ సింగ్ బజ్వాగా (Bhaktawar Singh Bajwa)గుర్తించారు.గురుద్వారా నిర్వహణకు సంబంధించిన వ్యవహారంలో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసి ఓ నిండు ప్రాణం బలైంది.

ఫగ్వారాలోని హదియాబాద్‌కు చెందిన భక్తవర్ సింగ్ చాలా ఏళ్లుగా బెల్జియంలో నివసిస్తున్నాడు.అతని కుటుంబంతో కలిసి అక్కడ నైట్ స్టోర్ నడుపుతున్నాడు.

అలాగే స్థానికంగా ఉన్న గురుద్వారాలో నిర్వహణ కమిటీలో సభ్యుడు కూడా.

Indian Origin Sikh Killed In Dispute At Belgian Gurdwara, Bhaktawar Singh Bajwa,
Advertisement
Indian Origin Sikh Killed In Dispute At Belgian Gurdwara, Bhaktawar Singh Bajwa,

ఇటీవల గురుద్వారాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్న సమయంలో పరిస్ధితి హింసాత్మకంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.తీవ్రగాయాల పాలైన భక్తవర్‌ సింగ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు.భక్తవర్ సింగ్ మరణవార్త తెలుసుకున్న ఫగ్వారాలోని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.

అలాగే బెల్జియంలోని స్థానిక సిక్కు సమాజం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Indian Origin Sikh Killed In Dispute At Belgian Gurdwara, Bhaktawar Singh Bajwa,

కాగా .యూరప్ దేశమైన బెల్జియంలో దాదాపు 10 వేల మందికి పైగా సిక్కులు ఉంటారని అంచనా.ఇక్కడ మైనారిటీ విభాగంలో ఈ మతం ఉంది.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఎంతో మంది సిక్కులు బెల్జియం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయారు.బెల్జియంలోని పలు ప్రాంతాల్లో గురుద్వారాలు ఉన్నాయి.

"పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!".. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!
అచ్చం మనిషిలాగే ఉన్నాడు.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో నిద్రపోతున్న విగ్రహం చూస్తే గుండె గుభేల్!

వాటర్‌మాల్, విల్వోర్డే, బోర్గ్‌లూన్, లీగ్, ఓస్టెండ్, ఘెంట్ నగరాల్లో ప్రఖ్యాత గురుద్వారాలు ఉన్నాయి.వీరు భారత్ - బెల్జియం సంబంధాల బలోపేతానికి కృషి చేయడంతో పాటు బెల్జియం ఆర్ధిక, సాంస్కృతిక అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు