బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) పై దాడి జరిగిన విషయం తెలిసిందే.గత రెండు రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.ఈ విషయం సంబంధించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఈ విషయంపై బాలీవుడ్ అలాగే టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే.సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ లు కూడా చేస్తున్నారు.
కాగా ఈ ఘటనఫై హీరోయిన్, నటి ఊర్వశీ రౌతేలా( Actress Urvashi Rautela ) ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.

ఆ సమయంలో ఊర్వశీ తన వజ్రపు ఉంగరాన్ని చూపించడం దాని గురించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.తాజాగా ఈ విషయంపై ఆమె సైఫ్ కు క్షమాపణలు చెప్పారు.ఈ మేరకు ఇన్‌స్టా లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.
ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘సైఫ్ సర్.మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నా.మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తునన్నాను.
ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు తెలియదు.
గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మహారాజ్ ( Daku Mahara )విజయోత్సాహంలో ఉన్నాను.

దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతులు గురించి మాట్లాడాను.ఈ విషయంలో సిగ్గు పడుతున్నా.నన్ను క్షమించండి.
ఈ దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను.ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయం.
మీపై గౌరవం పెరిగింది’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.సైఫ్ కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా ఊర్వశీ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఊర్వశి విషయానికొస్తే ఆమె తాజాగా బాలయ్య బాబు హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి హిట్ అయిన సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.