ఈ రెండు రకాల గింజలు మీ డైట్ లో ఉంటే మీరు బరువు తగ్గడం గ్యారంటీ!

ఇటీవల రోజుల్లో బరువు తగ్గడం( Weight Loss ) అనేది కూడా ఎంతో మందికి ఒక గోల్ గా మారిపోయింది.

వెయిట్ లాస్ అవ్వడం కోసం రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు.

చెమటలు చిందేలా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటారు.నాజూగ్గా మారడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే మీ డైట్ లో అవిసె గింజలు( Flax Seeds ) మరియు చియా సీడ్స్ ను( Chia Seeds ) తప్పక చేర్చుకోండి.

ఈ రెండు రకాల గింజలు బరువు తగ్గే ప్రక్రియను మరింత వేగం చేస్తుంది.అందుకోసం వాటిని ఎలా తీసుకోవాలి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Include These Two Types Of Seeds In Your Diet You Are Guaranteed To Lose Weight

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకుని అవి మునిగేలా వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ మరియు అవిసె గింజలను వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో ఒక స్మూతీ రెడీ అవుతుంది.

ఈ స్మూతీలో రుచికి సరిపడా తేనె కలిపి సేవించడమే.

Include These Two Types Of Seeds In Your Diet You Are Guaranteed To Lose Weight

రోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని( Smoothie ) కనుక తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ముఖ్యంగా ఈ స్మూతీ కడుపుని ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.ఆహార కోరికలను అణచివేస్తుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

కేలరీలు బర్న్ అయ్యే వేగాన్ని పెంచుతుంది.ఈ స్మూతీ రెగ్యులర్ డైట్ లో ఉంటే మీరు బరువు తగ్గడం గ్యారెంటీ.

Include These Two Types Of Seeds In Your Diet You Are Guaranteed To Lose Weight
Advertisement

పైగా అవిసె గింజలు, చియా సీడ్స్ లో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు అవసరమయ్యే శక్తిని శరీరానికి అందిస్తాయి.అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

మధుమేహం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.మెదడు పనితీరును పెంచుతాయి.

చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తాయి.మరియు పైన చెప్పిన స్మూతీని తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సైతం రెడ్యూస్ అవుతుంది.

తాజా వార్తలు