Bed Room Vasthu Tips : బెడ్ రూమ్ లో మంచం చుట్టూ.. ఈ వస్తువులు అస్సలు ఉండకూడదు.. ఉంటే మాత్రం..!

పడక గదిలో వాస్తు( Vasthu ) ఎంతో ముఖ్యమైనదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఎక్కువ సమయం ఈ గదిలోనే దంపతులు సమయం గడుపుతారు.

అలాగే విశ్రాంతి తీసుకుంటారు.వివాహం చేసుకున్న తర్వాత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలు గడిచేది ఈ గదిలోనే అని దాదాపు చాలా మందికి తెలుసు.

అందుకే పడక గది వాస్తు మన జీవితం, సంబంధం పై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.వాస్తు మాత్రమే కాకుండా అందులో ఉండే మంచం విషయంలో కూడా సరైన నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

మంచం చుట్టూ కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో వాస్తు లోపం ఏర్పడుతుంది.ఫలితంగా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

In The Bedroom Around The Bed These Things Should Not Be There At All If There
Advertisement
In The Bedroom Around The Bed These Things Should Not Be There At All If There

అందుకే నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులను మంచం దగ్గర పొరపాటున కూడా ఉంచకూడదు.దీని వల్ల ప్రతికూలత పెరుగుతుంది.జీవితంలో అనేక అశుభ ఫలితాలు ఎదురవుతాయి.

నిద్రపోయేటప్పుడు మంచం దగ్గర ఏ వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందికి ఇంట్లో చెప్పులు వేసుకుని నడిచే అలవాటు ఉంటుంది.

అలాగే వాటిని పడక గదిలో కూడా తీసుకుని వెళుతూ ఉంటారు.కానీ వాస్తు ప్రకారం బూట్లు, చెప్పులు( Shoes , sandals ) మంచం కింద అస్సలు ఉంచకూడదు.

దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది.అలాగే మంచం కింద చీపురు కూడా పెట్టకూడదు.

In The Bedroom Around The Bed These Things Should Not Be There At All If There
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

అలా ఉంచితే జీవితంలో ఆర్థిక సమస్యలను( Financial problems ) ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాగే నిద్రపోవడానికి ముందు మెడలోని గొలుసులు, గాజులు, బంగారు వస్తువులు, వెండి ఆభరణాలు తీసి పెట్టకూడదు.ఇలా పెట్టడం వల్ల వాస్తు లోపాలు ఏర్పడతాయి.

Advertisement

అలాగే మంచం కింద నీళ్ళ బాటిల్ అస్సలు పెట్టకూడదు.దీనివల్ల మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

ఇక గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి.మురికి బట్టలు ఎప్పుడు కూడా మంచం దగ్గర పెట్టకూడదు.

వాస్తు ప్రకారం ఇది అసలు మంచిది కాదు.ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

అలాగే వాస్తు ప్రకారం తల దగ్గర పుస్తకం అస్సలు పెట్టుకోకూడదు.

తాజా వార్తలు