పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో( Punjab Haryana Border ) రైతులు నిర్వహిస్తున్న ఆందోళన( Farmers Protest ) కొనసాగుతోంది.ఈ మేరకు రైతు ఉద్యమం 17వ రోజుకు చేరింది.
అధికారుల భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో ఢిల్లీని చేరలేకపోయిన రైతులు సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రైతులు ఇవాళ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.రైతుల ఆందోళనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Modi ) స్పందించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.కాగా ప్రస్తుతం శంభు, ఖనౌరీ సరిహద్దుల్లోనే అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి.