అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎల్లారెడ్డిపేట 2ఏఎన్ఎంల ముందస్తు అక్రమ అరెస్టులు

ఏఎన్ఎం( ANMs ) లను రెగ్యులర్ చేయాలని ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేయడం కోసం పిలుపునివ్వడంతో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 2 ఏఎన్ఎం లను ముందస్తు అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు.

ఈ సందర్భంగా 2 ఏఎన్ఎంలు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ఎన్ హెచ్ ఎం కింద 2 ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నామని, 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలోనే చేస్తున్నామని అన్నారు.

తెలంగాణ వస్తే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనే మాటే ఉండదని చెప్తే సంతోషించామని, తెలంగాణ ( Telangana ) వచ్చాక మా జాబు పర్మినెంట్ అవుతుందని ఆశపడ్డామని అన్నారు.కానీ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు కావస్తున్న మా జాబ్స్ పర్మినెంట్ చేయకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.2 ఏఎన్ఎంలను అందరినీ రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని 1 ఏఎన్ఎం లకు ఇస్తున్న మాదిరిగానే 2ఏఎన్ఎం లకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.ఆన్లైన్ ఆఫ్లైన్ అని అదనపు పని వారాలను మోపి 2 ఏఎన్ఎం లను వేధించడం తగదని అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.

అరెస్ట్ అయిన వారిలో స్వప్న దేవి, సువర్ణ, మంజుల, భారతి, సుజాత, రూప, పుష్పలత, రాజేశ్వరి, పద్మ, శ్యామల, అమృతవల్లి తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News