కోర్టు నిబంధనలు బేఖాతరు.. జైలు ఎదుటే చంద్రబాబు పొలిటికల్ స్పీచ్..!

సాధారణంగా ఎక్కడైనా రూల్స్ అనేవి ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉంటాయి.సామాన్యులకు ఒకలా, రాజకీయ నేతలకు ఒకలా ఉండవు.

కోర్టు ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందే.కానీ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా, సీఎంగానూ విధులు నిర్వహించిన వ్యక్తి అయి ఉండి ఆయన మాత్రం రూల్స్ ను పాటించరట.

Ignoring Court Rules.. Chandrababu's Political Speech In Front Of Jail..!-కో

కోర్టు నిబంధనలను సైతం బేఖాతరు చేస్తూ పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు.ఆయనే ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు.

వ్యవస్థలను సృష్టించడమే కాకుండా ఆ వ్యవస్థలను సరైన దారిలో నడపే వ్యక్తినంటూ చెప్పుకునే చంద్రబాబు కోర్టు నిబంధనలు పాటించడం మాత్రం మర్చిపోయారా అని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు సుమారు 52 రోజుల కాలంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజాగా ఈ కేసులో అనారోగ్య కారణాల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలోనే రాజకీయపరమైన స్పీచ్ లు ఇవ్వొద్దని, కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయొద్దన్న న్యాయస్థానం ఎటువంటి ర్యాలీలు సైతం నిర్వహించవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.

మీడియాతో మాట్లాడవద్దని, నెలరోజులు పూర్తయిన తరువాత నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశాలు ఇచ్చింది.అయితే ఏపీ హైకోర్టు పలు షరతులు విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే ఉల్లంఘించారు.

తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్న బాబు ఎవరినీ తప్పు చేయనివ్వను అంటూనే న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టారు.మీడియాతో మాట్లాడుతూ తాను జైలులో ఉన్న సమయంతో తనకు మద్ధతు ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లోని పలువురు నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

నెలరోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు విధించిన నిబంధనలు చంద్రబాబు ఒక్కరోజులోనే ఉల్లంఘించి తన తీరును బయటపెట్టారంటూ విమర్శిస్తూ ఏపీ వ్యాప్తంగా ఈ వార్త చక్కర్లు కొడుతుందని తెలుస్తోంది.తనను ఎవరేమి చేస్తారు అనే ధీమాతోనే ఆయన అలా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!

ఇక నెలరోజుల వ్యవధిలో ఇంకెన్ని విధాలుగా తన దూకుడును బయటపెట్టి కోర్టులను, వాటి తీర్పులను అవహేళన చేస్తారో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రతిపక్ష స్థాయిలో ఉండటంతో పాటు ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన చంద్రబాబు ఈ విధంగా వ్యవహారించడంపై మండిపడుతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు