దరిద్రం వదిలి పోవాలంటే ఇలా చేయండి.. వాసాలమర్రి గ్రామంలో కేసీఆర్ ముచ్చట.. !

ఫాం హొజ్‌ను వదిలి ఫాం లోకి వచ్చిన తెలంగాణ సీఎం ఈరోజు యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన ముచ్చట తెలిసిందే.

ఇక ఇక్కడి ప్రజలను తన మాటలతో తెగ మంత్ర ముగ్ధులను చేశారట.

అంతే కాకుండా గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేశారు.ఇక రాజకీయ తంత్రాలు ప్రయోగించడంలో గులాభి బాస్ తర్వాతే ఎవరైన అని ఈయన మాటల సరళి గమనించిన వారు తప్పక అనుకుంటారట.

If You Want To Leave The Poor Do This Kcr Mesmerizing In Vasalamarri Village, CM

ఇదిలా ఉండగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ దరిద్రం వదిలి పోవాలంటే ఏం చేయాలో బంగ్లాదేశ్ లో జరిగిన ఓ అంశాన్ని వివరించారు.ఆ వివరం ఏంటో గమనిస్తే.

బంగ్లాదేశ్ లో ప్రొఫెసర్ హష్మీ అనే వ్యక్తి పేదరికంతో బాధపడుతున్న కొందరు ఆడవాళ్లను చూసి జాలేసి వారి గురించి ఆరా తీసాడట.ఈ క్రమంలో వారు ఒక వడ్దీ వ్యాపారి దగ్గర ఉదయం డబ్బులు అప్పుగా తీసుకుని ఆ డబ్బుతో హోల్ సేల్ గా కూరగాయలు కొని, తిరిగి వాటిని నగరంలో అమ్ముకుని సాయంత్రానికి మళ్లీ షావుకారు వద్దకు వెళ్లి అతనికి డబ్బులు అతనికి ఇచ్చి, మిగతా డబ్బులతో ఇంటికి కావలసిన సరకులు తీసుకెళ్లే వారట.

Advertisement

ఇలా ఎంత శ్రమించిన వారి జీవితంలో అప్పులు తప్ప మార్పు లేదట.ఇక వీరి శ్రమను ఆ అప్పు ఇచ్చిన షావుకారు దోచుకోవడం గమనించిన ఆ ప్రొఫెసర్ వారికి కొంత అమౌంట్ తక్కువ వడ్దికి ఇచ్చి, అలా వారిచ్చే వడ్దిని దాచిపెట్టి చివరికి ఆ మొత్తాన్ని వారికి అప్పచెబుతూ ఇక నుండి అప్పులేకుండా సొంతగా వ్యాపారం చేసుకోండని ఈ కధను చెప్పారు సీఎం.

ఇక మీరు కూడా ఇలాగే గ్రూపులుగా ఏర్పడి డబ్బును పొదుపు చేసుకుంటూ దరిద్రాన్ని తరిమికొట్టండని కధలోని సారాన్ని వివరించారు.కానీ ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే.

సామాన్యుని సంపాదన అంతా పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే దోచుకుంటుంటే, అసలు దాచుకోవడానికి మిగలిని డబ్బుల గురించి చెప్పే బదులు ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుని ప్రజల నుండి వసూల్ చేసే పన్నులు తగ్గిస్తేనే కదా పైసా మిగిల్చుకునేది అని అనుకుంటున్నారట జనం ఈ పిట్ట కధ విని.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు