భూ కబ్జాను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా...?

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అంగడి స్థలాన్ని గ్రామానికి చెందిన గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశాడు.

దానికి అఖిలపక్ష నాయకులు అడ్డుకొని ప్రశ్నించారు.

దీనితో కబ్జా చేసిన వ్యక్తే అఖిలపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టించాడు.అంగడి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే తమపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం సంస్థాన్ నారాయణపురం చౌరస్తాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

If You Question The Land Acquisition, Will You File Illegal Cases , Rachakonda G

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా డాక్యుమెంట్లను స్తుష్టించి కబ్జా చేసి,గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ యుగేంధర్ తో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.తక్షణమే మాపై పెట్టిన కేసులు ఎత్తివేసి అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మందుగుల బాలక్రిష్ణ, సూరపల్లి శివాజీ,చిలివేరు అంజయ్య,తెలంగాణ భిక్షం,వలిగొండ యాదయ్య,ఉప్పరగొని యాదయ్య,నగేష్, రాచకొండ గిరి,రెవనపల్లి గోపాల్,మద్ది సంజీవ,పేర రమేష్,బద్ధుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News