ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే 70 లోనూ మీ జుట్టు నల్లగా మెరుస్తుంది!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.ఇందుకు కారణాలు అనేకం.

ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూను వినియోగించడం, పలు రకాల మందుల వాడకం, ధూమపానం, మద్యపానం త‌దిత‌ర అంశాల కారణంగా జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.ఫలితంగా నల్లగా ఉండాల్సిన జుట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది.

అయితే తెల్ల జుట్టు వచ్చాక దాన్ని కవర్ చేసుకునేందుకు ముప్పతిప్పలు పడే కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే 70 లోనూ మీ జుట్టు నల్లగా మెరిసిపోతుంది.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, ఒక గ్లాస్‌ వాటర్ వేసుకుని బాగా కలిపి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి.

Advertisement

ఈ లోపు రెండు ఉసిరికాయల‌ను తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు, అవిసె గింజలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన పదార్థాలను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.దీంతో తెల్ల జుట్టు దరిచేరకుండా ఉంటుంది.70 లోనూ మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.కాబట్టి తెల్ల జుట్టుకు ఎవరైతే దూరంగా ఉండాలని భావిస్తున్నారో తప్పకుండా పైన చెప్పిన సింపుల్ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు