వ‌ర్షాకాలంలో దుస్తుల నుంచి చెడు వాస‌న వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో కారు మబ్బులు, చల్లని పిల్ల గాలులు, చిట‌ప‌ట చినుకులు మ‌న‌సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి.

అయితే మ‌రోవైపు ఎన్నో స‌మ‌స్య‌లు సైతం త‌లుపు త‌డుతుంటాయి.ముఖ్యంగా ఈ వ‌ర్షాకాలంలో దుస్తుల నుంచి వ‌చ్చే చెడు వాస‌న అంతా ఇంతా కాదు.

వ‌ర్షాల వాల్ల దుస్తులు స‌రిగ్గా ఆర‌నే ఆర‌వు.ఇలాంటి దుస్తుల్ని మడత పెట్టి వార్డ్‌రోబ్‌లో పెట్టామంటే.

ఇక‌ వాటిలో ఉండే తేమ కార‌ణంగా ఫంగస్‌ వృద్ధి చెంది అదో రకమైన చెడు వాస‌న వ‌స్తుంటుంది.వ‌ర్షాకాలంలో దాదాపు అంద‌రికీ ఎదుర‌య్యే స‌మ‌స్యే ఇది.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే.చెడు వాస‌న రాకుండా దుస్తులు తాజాగా ఉంటాయి.

Advertisement
If You Follow These Simple Tips, Bad Smell Will Not Come From Your Clothes Durin

మ‌రి ఇంత‌కీ ఈ సింపుల్ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.రోజ్ వాట‌ర్‌, నిమ్మ‌ర‌సం.

ఈ రెండిటినీ ఉప‌యోగించి బట్ట‌ల నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌ను అడ్డుకోవ‌చ్చు.అవును, బ‌ట్ట‌ల‌ను ఉతికే నీటిలో లేదా వాషింగ్ మెషిన్‌లో రెగ్యుల‌ర్ డిటర్జెంట్‌తో పాటు అర క‌ప్పు రోజ్ వాట‌ర్‌, నాలుగు టేబుల్ స్పూన్లు నిమ్మ ర‌సం క‌లిపాలి.

ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.వెనిగర్‌, బేకింగ్ సోడా.

ఈ రెండు కూడా బ‌ట్ట‌ల నుంచి దుర్వాస‌న రాకుండా చేయ‌గ‌ల‌వు.అందుకోసం బ‌ట్ట‌ల‌ను వాట‌ర్‌లో నాన‌బెట్టేట‌ప్పుడు లేదా వాషింగ్ మెషిన్‌లో వేసేటప్పుడు డిటర్జెంట్‌తో పాటు వ‌న్ టేబుల్ బేకింగ్ సోడా, వ‌న్ టేబుల్ స్పూన్ వెనిగ‌ర్‌ను కూడా వేయాలి.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

ద్వారా ఫంగస్‌, బ్యాక్టీరియాలు దుస్తుల్లో వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.ఫ‌లితంగా బ‌ట్ట‌ల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది.

If You Follow These Simple Tips, Bad Smell Will Not Come From Your Clothes Durin
Advertisement

ఇక కొంద‌రు తడిసిన దుస్తుల్ని రోజుల తరబడి ఉతకకుండా పక్కన పెట్టేస్తుంటారు.ఇలా చేయ‌డం వ‌ల్ల చెడు వాస‌న రావ‌డ‌మే కాదు దుస్తుల నాణ్య‌త కూడా దెబ్బ తింటుంది.అందుకే త‌డిసిన బ‌ట్ట‌ల‌ను వెంట‌నే ఉతికేసి ఆర‌బెట్టుకోవాలి.

తాజా వార్తలు