సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు: ఎస్సై నవీన్ కుమార్

సూర్యాపేట జిల్లా:సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు,వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని,కేసులు నమోదు చేస్తామని అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు,వీడియోలు,వాట్సాప్ స్టేటస్ ద్వారా ఇతరులను కించపరిచినా, ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు పరిశీలన చేయాలన్నారు.

అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని,వివాదాస్పదమైన పోస్టులకు దూరంగా ఉండాలని,గ్రూప్ అడ్మిన్ కుడా పోస్ట్స్ పరిశీలన చేయాలని సూచించారు.అందరూ గ్రామాలలో స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలన్నారు.

If Inappropriate Comments Are Made On Social Media, Action Will Not Be Taken, Sa

సోషల్ మీడియాని పోలీస్ శాఖ ప్రతిరోజు పరిశీలిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరు పోస్ట్ చేసే ముందు ఆలోచించి పోస్ట్ చేయాలని, లేనియెడల వారిపైన,గ్రూప్ అడ్మిన్ల పైన కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.

అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

Latest Suryapet News