రాత్రి 10 తర్వాత సుధీర్ చేసే పనులు ఇవే... సుధీర్ బండారం బయటపెట్టిన ఆది?

బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి సుడిగాలి సుదీర్ ( Sudigali Sudheer ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పే వెండితెరపై హీరోగా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.సుడిగాలి సుదీర్ జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో పనిచేశాడు అనంతరం ఇతర బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా పనిచేశారు.

 Hyper Aadi Reveals Sudheer Secrets At Calling Sahastra Pramotions , Sudheer, Hyp-TeluguStop.com

ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈయనకు ఏకంగా సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ సుడిగాలి సుదీర్ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

తాజాగా ఈయన కాలింగ్ సహస్ర ( Calling Sahastra ) అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Telugu Sahastra, Hyper Aadi, Pradeep, Sudheer-Movie

ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తిరిగి ఈ టీవీలో ప్రసారమవుతున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు.తాజాగా ఈయన ఢీ కార్యక్రమంలో కూడా సందడి చేసినట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తుంది.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సుధీర్ ఎంటర్ అవడంతో హైపర్ ఆది ( Hyper Aadi ) సుధీర్ పట్ల పెద్ద ఎత్తున కామెడీ పంచ్ డైలాగులు వేయడమే కాకుండా సుధీర్ సీక్రెట్స్ అన్ని కూడా బయటపెట్టారు.

Telugu Sahastra, Hyper Aadi, Pradeep, Sudheer-Movie

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ సుడిగాలి సుదీర్ రాత్రి 10 వరకే కాలింగ్ సహస్ర 10 తర్వాత దాటిందా.కాలింగ్‌ గీత, కాలింగ్‌ సరళ.ఫస్ట్ కాలింగ్‌.ఆ తర్వాత కూలింగ్‌.ఆ తర్వాత లింగడి లింగడి లింగడి.అంటూ అసలు విషయం చెప్పాడు ఆది. ఇలా సుధీర్ గురించి హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ అందరికీ నవ్వులు పూయించాయి.మరో వైపు ప్లే బాయ్‌ గేమ్‌ ఆడాడు.ఏ కలర్‌ మీకు కావాలని అడిగాడు సుధీర్‌.దీనికి యాంకర్‌ ప్రదీప్‌( Pradeep ) పర్పుల్‌ అని చెప్పాడు.అరే పర్పులు అంట వెళ్లి తెద్దాం పదా అంటూ వెళ్లడంతో వెంటనే ప్రదీప్ ఆపి రే అవి పరుపులు కాదురా పర్పుల్‌ అంటూ ఎప్పటిలాగే సుధీర్ ,ఆది ,ప్రదీప్ మధ్య సరదాగా సాగినటువంటి ఈ సన్నివేశాలకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube